జిల్లా విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

NLR: జిల్లా విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం యశస్వి స్కాలర్షిప్ దరఖాస్తు గడువు ఈనెల 15వ తేదీ వరకు పొడిగించింది. వార్షికాదాయం రూ. 2.50 లక్షల లోపు ఉన్న బీసీ, ఓబీసీ, మైనార్టీ, డీఎన్టీ విద్యార్థులు ఈ పథకానికి అర్హులు. 9, 10వ తరగతి వాళ్లకు రూ. 75 వేలు, ఇంటర్ వాళ్లకు గరిష్ఠంగా రూ.1.25 లక్షలు స్కాలర్షిప్ ఇస్తారు.