CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

NDL: పాణ్యం నియోజకవర్గంలో 20 మంది లబ్ధిదారులకు రూ. 13,49,911 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎప్పుడూ బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని, ప్రతి అర్హుడికి న్యాయం జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.