బంగాళాఖాతంలో భూకంపం

బంగాళాఖాతంలో భూకంపం

బంగాళాఖాతంలో ఇవాళ ఉదయం భూమి స్వల్పంగా కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.2గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) వెల్లడించింది. ఉదయం 7:26 గంటల సమయంలో సముద్ర గర్భంలో 35 కిలోమీటర్ల లోతున ఈ భూకంపం సంభవించినట్లు అధికారులు గుర్తించారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని NCS తన' X' ఖాతా ద్వారా తెలిపింది. దీంతో తీరప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.