రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
ఖమ్మం రూరల్ మండలం గుర్రాలపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తిరుమలాయపాలెం మండలం బీరోలుకు చెందిన కూరపాటి వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందాడు. బట్టల వ్యాపారం చేస్తున్న వెంకటేశ్వర్లు బైక్ పై వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న గ్రానైట్ లారీ ఢీకొట్టింది. దీంతో లారీ చక్రల కిందపడిపోయి తల నుజ్జునుజ్జు అయి అక్కడికక్కడే మృతి చెందాడు.