పెర్‌ప్లెక్సిటీకి అమెజాన్ లీగల్ నోటీసులు
పెర్‌ప్లెక్సిటీకి అమెజాన్ నోటీసులు పంపించింది. సంస్థకు చెందిన ఏఐ ఆధారిత వెబ్‌బ్రౌజర్ కామెట్ ద్వారా అమెజాన్‌లో షాపింగ్ చేసే సదుపాయం నిలిపివేయాలని తెలిపింది. దీనిపై పెర్‌ప్లెక్సిటీ సీఈవో స్పందిస్తూ.. అమెజాన్‌తో కలిసి తాము పనిచేయాలనుకుంటున్నట్లు తెలిపారు. కానీ, కామెట్ అసిస్టెంట్‌ను బ్లాక్ చేస్తే తమ యూజర్ల ప్రయోజనాలను దెబ్బతీసినట్లు అవుతుందన్నారు.