ఆలయంలో విరిగిన ధ్వజస్తంభం
NGKL: కొల్లాపూర్ మండలంలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. సోమశిలలోని శ్రీ అభయ వీరాంజనేయస్వామి ఆలయంలో గత మూడు రోజులుగా విగ్రహ, ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం ఆంజనేయ స్వామి విగ్రహంతో పాటు ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠిస్తున్న సమయంలో అది ఒక్కసారిగా విరిగి కిందపడింది. ఇందులో ఎవరికీ ప్రమాదం జరగలేదు.