నిజామాబాద్ హైవేపై ట్రాఫిక్ మళ్లింపు చర్యలు
JGL: జగిత్యాల నుంచి నిజామాబాద్ హైవేపై మంచినీళ్ల బావి వద్ద వంతెన నిర్మాణ పనుల నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టినట్లు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. పనులు జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన, వాహన రాకపోకలకు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించి పోలీసులకు సహకరించాలని వాహనదారులను కోరారు.