బీటీ రోడ్డుపై పడి వ్యక్తి మృతి

బీటీ రోడ్డుపై పడి వ్యక్తి మృతి

WGL: నడుచుకుంటూ వెళ్తూ బీటి రోడ్డుపై పడి ఓ రైతు మృతి చెందిన ఘటన సోమవారం పర్వతగిరి మండలం దస్రోత్ తండా వద్ద చోటు చేసుకుంది. ఎస్సై ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇస్లావత్ వెంకన్న అనే రైతు నడుచుకుంటూ తన పొలానికి వెళ్తున్న క్రమంలో రోడ్డుపై పడిపోవడంతో తలకు బలమైన గాయాలు అయ్యాయి. దీంతో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.