మమత సర్కార్‌పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్
బెంగాల్ ప్రభుత్వం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పట్ల వ్యవహరించిన తీరు దురదృష్టకరమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. సంతాళీ తెగ సమ్మేళనాన్ని ఆ జనాభా తక్కువ ఉన్న చోట నిర్వహించడం, కనీస ప్రొటోకాల్ పాటించకుండా CM మమతా గైర్హాజరు కావడం గిరిజన జాతులను అవమానించడమేనని విమర్శించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వారిని రాజకీయాల్లోకి లాగడం ఏమాత్రం సరికాదని ధ్వజమెత్తారు.