‘సమ్మర్ క్యాంపుల పేరుతో తరగతులు నిర్వహిస్తే చర్యలు’

‘సమ్మర్ క్యాంపుల పేరుతో తరగతులు నిర్వహిస్తే చర్యలు’

KRNL: జిల్లాలో గురువారం నుంచి అన్ని పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన సమ్మెటివ్-2 పరీక్షలు ఏప్రిల్ 16న ముగిశాయి. పరీక్షల మూల్యాంకనం, ఫలితాల నమోదు, ప్రోగ్రెస్ కార్డుల పంపిణీ పూర్తయింది. సెలవుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్. సుధాకర్ ఆదేశాలు జారీ చేశారు.