VIDEO: గాదిగూడలో ఓపెన్ స్కూల్ సెంటర్ ప్రారంభం
ADB: గాదిగూడ మండలం ఝరి గ్రామంలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో ఆదివారం ఓపెన్ స్కూల్ సెంటర్‌ను ప్రారంభించారు. ఇందులో పదో తరగతిలో 51 మంది, ఇంటర్మీడియేట్‌లో 31 మంది విద్యార్థులు తమ పేర్లను నమోదు చేశారని ప్రధానోపాధ్యాయుడు రవీందర్ రాథోడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సోము, కోలేట్కర్ ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.