VIDEO: ఎలుగుబంటి హల్ చల్..

ATP: రాయదుర్గం పట్టణం ముత్తరాసి కాలనీ కురాకులగుట్ట వద్ద ఎలుగుబంటి హల్చల్ చేసింది. కొండపై ఉన్న గుడి మెట్లపై పడుకుని నిద్రపోయింది. కాసేపటికి గుహ వద్దకు వెళ్లింది. అటుగా బైపాస్ రోడ్డులో వెళ్తున్న వాహనదారులు, పాదచారులు, రైతులు ఎలుగుబంటి సంచారంతో భయాందోళనకు గురయ్యారు. ఇటీవల కొంతకాలంగా ఈ కొండలో రెండు ఎలుగుబంట్లు సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.