గంజాయి కేసులో యువకుడు అరెస్ట్

గంజాయి కేసులో యువకుడు అరెస్ట్

SRCL: గంజాయి కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని పట్టుకున్నట్లు ఎస్పీ మహేష్ బి గితే తెలిపారు. సిరిసిల్లకు చెందిన ఎండీ అహ్మద్ అనే వ్యక్తి 15 కేసుల్లో నిందితునిగా 5 కేసుల్లో పరారీగా ఉన్నాడు. సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. పరారీలో ఉన్న అహ్మద్‌ను పోలీసులు చాకచక్యంగా పట్టుకుని, రిమాండ్‌కు తరలించారు.