మనీలాండరింగ్ కేసులో అంబానీపై ఈడీ చర్యలు
మనీలాండరింగ్ కేసులో అనిల్ అంబానీపై ఈడీ చర్యలు చేపట్టింది. ఆయనకు చెందిన రూ.3,084 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఆయనపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. రూ.17 వేల కోట్ల నిధులను అక్రమంగా మళ్లించినట్లు అనిల్ అంబానీ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.