VIDEO: యూరియా కోసం బారులు తీరిన రైతులు

HNK: ఎల్కతుర్తి మండల కేంద్రంలో పీఏసీఎస్ గోదాం వద్ద మంగళవారం యూరియా బస్తాల కోసం రైతులు ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో బారులు తీరారు. గోదాం వద్ద లారీ లోడ్ యూరియా వచ్చినట్లు తెలియగానే, రైతులు ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. రైతుల మద్య తోపులాట చోటుచేసుకుంది. అదికారులు స్పందించి రైతులకు సరిపడా యూరియా అందించాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.