పెద్దమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు

పెద్దమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు

BDK: పాల్వంచ మండలం జగన్నాధపురం గ్రామంలో కొలువైన శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయంలో ఆదివారం ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. సెలవు దినం కావడంతో జిల్లా నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. మొక్కులు చెల్లించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ఈవో రజనీకుమారి, ఛైర్మన్ బాలినేని, ధర్మకర్తలు, భక్తులు పాల్గొన్నారు.