ఏపీ ప్రజలకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు
AP: రాష్ట్ర ప్రజలందరికీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 'ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు 56 రోజుల పాటు చేసిన నిరవధిక ఆమరణ దీక్ష, ప్రాణత్యాగంతో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు జరిగింది. ఆయన త్యాగ ఫలితంగా భాషా ప్రయుక్త రాష్ట్ర ఏర్పాటు జరిగింది. రాష్ట్ర అభివృద్ధికి అందరూ కృషి చేయాలి' అంటూ ట్వీట్‌లో కోరారు.