VIDEO: యాదగిరిగుట్టలో ఘనంగా లక్ష దీపోత్సవం
BHNG: యాదగిరిగుట్ట లోటస్ టెంపుల్‌లో నిన్న రాత్రి పెండం శ్రీనివాస గురుస్వామి ఆధ్వర్యంలో కార్తీక లక్ష దీపోత్సవం, అయ్యప్ప స్వామి పడిపూజ ఘనంగా నిర్వహించారు. ముందుగా గణపతి సుబ్రహ్మణ్య స్వామి అమ్మవారి పూజలు నిర్వహించి, కార్తీకదీపం వెలిగించారు. అనంతరం స్వామి పడి పూజ చేసి, ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో స్వాములు, మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.