కృష్ణుని ఆశీస్సులు జనులందరిపై ఉండాలి: వసంత

కృష్ణుని ఆశీస్సులు జనులందరిపై ఉండాలి: వసంత

NTR: మైలవరం పట్టణంలో శ్రీకృష్ణాష్టమి పర్వదినం వేడుకలను శనివారం ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ భగవానునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందరికి సౌభాగ్యం, ఆనందం, ఆరోగ్యం, విజయాలు కలగాలని ఆకాంక్షించారు. శ్రీ కృష్ణుని దివ్య ఆశీస్సులు జనులందరిపై ఉండాలని, అందరికీ శుభాలు కలగాలని కోరారు.