అక్రమ ఇసుక రవాణాపై ప్రత్యేక నిఘా: ఎస్పీ
ASF: అక్రమ ఇసుక రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ నితిక పంత్ వెల్లడించారు . జిల్లాలో నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో 13 కేసులు నమోదు చేశామని తెలిపారు. ఇస్గాం PS పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న వ్యక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ముగ్గురిపై ఎక్స్‌టార్షన్ కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు.