10.18 కేజీల గంజాయి స్వాధీనం
KMM: గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఖమ్మం జీఆర్పీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం ఖమ్మం రైల్వే స్టేషన్ 2వ ఫ్లాట్ ఫామ్ వద్ద తనిఖీ నిర్వహిస్తుండగా ఒడిశాకు చెందిన ఇద్దరు అనుమానంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా రూ.5.15లక్షల విలువైన 10.18 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరిని రిమాండ్‌కు తరలించారు.