VIDEO: మందపల్లి శనేశ్వర స్వామిని దర్శించిన సినీ నటుడు
కోనసీమ: ప్రముఖ జబర్దస్త్, సినీ నటుడు సుడిగాలి సుధీర్ మందపల్లి శనేశ్వర స్వామి వారిని మంగళవారం సాయంత్రం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన సుధీర్ అనంతరం ఆలయ విశిష్టతను అడిగి తెలుసుకున్నారు.