'ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి'

వనపర్తి జిల్లా మిల్లుల ద్వారా ఎఫ్.సీ.ఐకు ఇవ్వాల్సిన సిఎంఆర్ ధాన్యాన్ని త్వరగా ఇవ్వాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్యా నాయక్ ఆదేశించారు. శుక్రవారం మదనపూర్ మండలంలోని వాసవి ఇండస్ట్రీస్ రైస్ మిల్లును అదనపు కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైస్ మిల్లులో ఉన్న ప్రస్తుత నిల్వ ఉన్న ధాన్యం స్టాకులను క్షుణ్ణంగా పరిశీలించారు.