నిమజ్జన కార్యక్రమాన్ని పర్యవేక్షించిన ఎస్పీ

KRNL: ఆదోని మండలం హరివాణంలో ఆదివారం ఎల్లెల్సీ కెనాల్ వద్ద జరుగుతున్న గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ఎస్పీ విక్రాంత్ పాటిల్ పర్యవేక్షించారు. నిమజ్జనం సజావుగా సాగేలా గట్టి చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆయన ఆదేశించారు. వినాయక నిమజ్జనం పూర్తి అయ్యే వరకు అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.