మండలంలో అరటి పంటలు పరిశీలన
ATP: రాప్తాడు మండలం గంగలకుంట గ్రామంలో ఉద్యాన పంటలను మండల ఉద్యాన శాఖ అధికారి దివ్య పరిశీలించారు. ఆ గ్రామ రైతులు సాగుచేసిన అరటి పంటలను ఆమె పరిశీలించారు. పంటకు ఆశించే చీడపీడలు, వాటి నివారణ గురించి రైతులకు ఆమె సూచించారు. మండల ఉద్యాన శాఖ అధికారి దివ్య మాట్లాడుతూ.. మందులు కూడా అధికారులు సూచించిన సిఫార్సు మేరకు మాత్రమే పిచికారి చేయాలన్నారు.