'ది గ్రేట్ వైజాగ్ షాపింగ్ ఫెస్టివల్' ప్రారంభం
VSP: సూపర్ జీఎస్టీ -సూపర్ సేవింగ్స్‌పై అవగాహన కల్పించేందుకు విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో 'ది గ్రేట్ వైజాగ్ షాపింగ్ ఫెస్టివల్' గురువారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమైంది. కలెక్టర్ హరేంధిర ప్రసాద్, స్టేట్ జీఎస్టీ అదనపు కమిషనర్ సీతారాం శేఖర్ తదితర అధికారులు బెలూన్లు ఎగురవేసి ఈ ఫెస్టివల్‌ను ప్రారంభించారు.