నేడు కాళేశ్వరంలో సామూహిక వరలక్ష్మీ వ్రతం

BHPL: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తున్నారు. శివ కళ్యాణం మండపం ఆవరణలో ఉదయం 10:30 గంటలకు ఆలయ పూజారులు సంకల్ప పూజతో వరలక్ష్మీ వ్రతం ప్రారంభిస్తారని ఆలయ కార్యనిర్వహణాధికారి మహేష్ తెలిపారు. దేవాలయ దర్శనానికి వచ్చే భక్తులు పూజలో కూర్చునే అవకాశం లభిస్తుంది.