హైదరాబాద్‌కు మిస్ వరల్డ్ కార్యాలయ అధికారి హేన్రిక్

HYD: మిస్ వరల్డ్-2025 పోటీల నేపథ్యంలో వివిధ దేశాల ప్రముఖులు హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. మిస్ వరల్డ్ ఏర్పాట్లను పరిశీలించడానికి లండన్‌లోని మిస్ వరల్డ్ కార్యాలయ నిర్వాహక సీనియర్ అధికారి హేన్రిక్ ఫౌటెస్ సిటీకి వచ్చారు. ఆయనకు శంషాబాద్ విమానాశ్రయంలో సంప్రదాయ పద్ధతితో ఆహ్వానించారు. అనంతరం స్థానిక నిర్వాహకులతో హేన్రిక్ ఫౌటెస్ సమావేశం కానున్నారు.