సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ACP
మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను బెల్లంపల్లి ACP రవికుమార్ బుధవారం తనిఖీ చేశారు. ACP మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు. సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలయిన తాండూర్, అచలాపూర్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు.