రేపు భారత్-సౌతాఫ్రికా రెండో టీ20

రేపు భారత్-సౌతాఫ్రికా రెండో టీ20

భారత్-సౌతాఫ్రికా మధ్య రేపు రెండో టీ20 జరగనుంది. న్యూ చండీగఢ్ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి టీ20లో సఫారీలను చిత్తు చేసిన టీమిండియా ఈ మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు తొలి మ్యాచ్‌లో ఘోర ఓటమికి బదులుతీర్చుకోవాలని సౌతాఫ్రికా భావిస్తోంది. దీంతో ఈ మ్యాచ్ ఆసక్తికరంగా మారనుంది.