VIDEO: కోమరోలులో కార్డెన్ సెర్చ్
ప్రకాశం: కొమరోలు పట్టణంలోని బీసీ కాలనీలో సీఐ రామకోటయ్య ఆధ్వర్యంలో శనివారం తెల్లవారుజామున కార్డెన్ సర్చ్ నిర్వహించారు. అనుమానిత ప్రదేశాలలో సెర్చ్ నిర్వహించి సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రామకోటయ్య తెలిపారు. దొంగతనాలను అరికట్టడానికి ప్రజలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సీఐ సూచించారు.