బన్నీ, అట్లీ సినిమా షూటింగ్ UPDATE
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబోలో మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం బన్నీపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. 2026 మే నాటికి అల్లు అర్జున్ పార్ట్ షూట్ మొత్తం పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. ఇక సన్‌పిక్చర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో దీపికా పదుకొనె కీలక పాత్రలో కనిపించనుంది.