రోడ్డుపై నిలిచిన నీరు.. వాహనదారుల ఇబ్బందులు
HYD: భారీ వర్షం కారణంగా మంగళ రైల్వే అండర్ బ్రిడ్జి సమీపంలో & మియాపూర్ రోడ్డులోని HDFCకి ఇరువైపులా వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్పందించిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అవసరమైన చర్యలు చేపట్టారు. వాహనదారులు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని లేదా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకొని ప్రయాణించాలని కోరారు.