నీరు లేక ఎండుతున్న పంటలు

JN: జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పరిధిలోని దేవరుప్పుల మండలంలో సాగునీరు లేక పంట పొలాలు పూర్తిగా ఎండిపోతున్నాయి. చెరువులు, కుంటలు ఎండిపోవడం తో భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. దీనితో ఎండిన పంటలను రైతులు పాడి పశువులకు మేతగా వదిలేశారు. ఇలాంటి దుస్థితిలో అప్పులు ఎలా తీర్చాలో అర్థం అవ్వట్లేదని ఆవేదన చెందుతున్నారు.