తెనాలిలో గంజాయి ముఠా అరెస్టు

GNTR: ఒడిశా నుంచి గంజాయి తెచ్చి విక్రయిస్తున్న ఐదుగురు నిందితులను బుధవారం తెనాలి 3-టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. బాలకృష్ణ, ముజాహిద్, కార్తీక్, శివ కుమార్, సమీర్ హుస్సేన్‌లు బాలాజీరావుపేటలో గంజాయి తాగుతుండగా, డీఎస్పీ జనార్ధనరావు ఆదేశాలతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 1.150 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.