మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి నేటితో తెర

మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి నేటితో తెర

వరంగల్ జిల్లాలో వర్ధన్నపేట, నర్సంపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్య శారద తెలిపారు. పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచి సైలెన్స్ పీరియడ్ అమల్లోకి వస్తుందని, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.