కొండచిలువ కలకలం.. హత మార్చిన గ్రామస్తులు
SRCL: బోయినిపల్లి మండలం రత్నంపేట గ్రామంలో ఆదివారం కొండచిలువ ప్రత్యక్షమై కలకలం సృష్టించింది. గొర్రెలను మేపేందుకు గ్రామస్తులు వెళ్లగా కొండచిలువ రావడంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. దాదాపు 6 అడుగుల వరకు ఈ కొండచిలువ ఉంటుందని తెలిపారు. దీంతో కాపరులు కొండచిలువను చంపి వేశారు. కొండచిలువను చూసేందుకు గ్రామస్తులు తరలివచ్చారు.