బేగంపేట బస్తీల్లో ఎమ్మెల్యే తలసాని పర్యటన
HYD: ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యమని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం బేగంపేట డివిజన్ పరిధిలోని దేవిడి ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఇంటింటికీ తిరుగుతూ బస్తీ వాసుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో మాట్లాడి, పెండింగ్‌లో ఉన్న సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు.