VIDEO: అటవీ శాఖ చర్యలతో రైతుల్లో ఆందోళన

VIDEO: అటవీ శాఖ చర్యలతో రైతుల్లో ఆందోళన

MHBD: కొత్తగూడ మండలం కార్లయి గ్రామంలోని బత్తులపల్లిలో బుధవారం అటవీ శాఖ చర్యలతో ఉద్రిక్తత నెలకొంది. సుమారు 25 ఏళ్లుగా సాగులో ఉన్న జనగాం ప్రవీణ్‌కు చెందిన 5 ఎకరాల భూమి చుట్టూ అధికారులు ట్రెంచ్ తవ్వి భూమిని స్వాధీనం చేసుకున్నారు. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో సుమారు 25 ఎకరాల భూమిపై అధికారుల కన్ను పడిందని రైతులు ఆరోపిస్తున్నారు.