పేకాట శిబిరంపై దాడి.. ముగ్గురు అరెస్ట్
W.G: నరసాపురం మండలం కొత్త నవరసాపురం శివారులో సోమవారం పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసినట్లు నరసాపురం రూరల్ ఎస్ఐ టి. వెంకట సురేశ్ తెలిపారు. ఈ దాడిలో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. వారి వద్ద నుంచి రూ.9020 నగదు, 4 బైక్స్, 5 సెల్ ఫోన్స్, 52 పేక ముక్కలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.