'టీబీ నివారణకు ప్రత్యేక చర్యలు'
KMR: టీబీ వ్యాధి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రోగ్రామ్ అధికారి ప్రదీప్ సూచించారు. బిక్కనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆయన, రోగుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు క్రమం తప్పకుండా మందులు అందేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి హేమీమా, ఆరోగ్య విస్తీర్ణ అధికారి వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.