భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూమ్: కలెక్టర్

భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూమ్: కలెక్టర్

గుంటూరు జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ కార్యాలయంలో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా శనివారం తెలిపారు. సహాయం కోసం 0863-2234014 నంబరులో సంప్రదించాలన్నారు. మూడు షిఫ్టుల్లో సిబ్బందిని విధులు నిర్వహించేలా నియమించామని ఆమె పేర్కొన్నారు. ప్రజలు సమస్యలు తెలియజేస్తే అధికారులు వెంటనే సహాయం అందిస్తారని వెల్లడించారు.