బస్సు డ్రైవర్‌కు జైలు శిక్ష
PPM: సాలూరులో అజాగ్రత్తగా బస్సు నడిపి వ్యక్తి గాయానికి కారణమైన ఆర్టీసీ డ్రైవర్ బెహరా శ్రీనివాసరావుకు జూనియర్ సివిల్ జడ్జి జి.హర్షవర్ధన్ 2 నెలల జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధించారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ మాధవి వాదించగా, ఈ వివరాలను హెడ్ కానిస్టేబుల్ ఎన్. సత్యంనాయుడు వెల్లడించారు. బాధ్యతారాహిత్యంగా డ్రైవింగ్ చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.