సామెత - దాని అర్థం
సామెత: 'అత్త మీద కోపం.. దుత్త మీద తీసినట్లు'
అర్థం: దుత్త అంటే మట్టితో చేసిన చిన్న కుండ. మజ్జిగ వంటి వాటిని నిల్వ ఉంచడానికి వాడుతారు. అయితే, కోడలికి అత్త మీద కోపం వస్తే.. ఏం చేస్తుంది? ఆ కోపాన్ని చేతిలో ఉన్న దుత్త మీద చూపుతూ.. విసిరి పగలగొడుతుంది. అందుకనే సాధారణంగా ఒకరి మీద కోపం.. మరొకరి మీద చూపించినప్పుడు ఈ సామెత వాడుతారు.