VIDEO: అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలపై సమావేశం
VZM: ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి తెలిపారు. ఈ మేరకు మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ రోజు ఉదయం 10.30 గంటలకు వివిధ రంగాల్లో ఉత్తమ సేవలందిస్తున్న మహిళలను సత్కరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మేయర్ వెంప డాపు విజయలక్ష్మి పాల్గొన్నారు.