కళ్యాణదుర్గంలో డీడీఓ కార్యాలయం ప్రారంభం
ATP: కళ్యాణదుర్గం డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారి కార్యాలయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్‌గా ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు కార్యాలయం వద్ద శిలాఫలకాన్ని ఆవిష్కరించి, రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. ఈ కొత్త కార్యాలయం గ్రామీణాభివృద్ధి మరింత వేగంగా జరగడానికి ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే అమిలినేని తెలిపారు.