VIDEO: కార్తీక మాస ఉత్సవాలకు ఎమ్మెల్యేకి ఆహ్వానం
KDP: ప్రొద్దుటూరు శ్రీ అగస్త్యేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న కార్తీక మాస ఉత్సవాలకు స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డిని ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ వెంకట సుబ్బయ్య ఆహ్వానించారు. ఆదివారం ప్రొద్దుటూరులోని క్యాంప్ ఆఫీస్‌లో ఎమ్మెల్యేని కలిశారు. అనంతరం కార్తీక మాసంలో ఆలయంలో జరుగుతున్న ఉత్సవాలు, ఏర్పాట్లను వివరించారు.