ట్రాఫిక్ ఉల్లంఘనలపై 160 కేసులు నమోదు
కడప జిల్లాలో ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే చట్టప్రకారం చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ హెచ్చరించారు. బుధవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక వాహన తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన 160 మందిపై కేసులు నమోదు చేసి, రూ.40,810 జరిమానా విధించినట్లు తెలిపారు.