వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు

MBNR: ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన జడ్చర్ల మండలంలో చోటుచేసుకుంది. SI చంద్రమోహన్ వివరాల ప్రకారం.. మండలంలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన నీలకంఠ(44) కూలీ పని చేస్తూ జీవనం సాగించేవాడు. గత నెల 25న హైదరాబాద్ వెళుతున్నానని చెప్పి ఇంతవరకు తిరిగి రాలేదు. బంధువుల ఇళ్లలో వెతికిన ఆచూకీ లభించలేదు. మంగళవారం భార్య సుజాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.