వ్యవసాయం మార్కెట్లో రైతులకు మధ్యాహ్న భోజనం

NGKL: కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్లు వ్యవసాయం మార్కెట్లో రైతులకు మధ్యాహ్న భోజనం పథకాన్ని మార్కెట్ ఛైర్ పర్సన్ యట గీత సోమవారం ప్రారంభించారు. వివిధ గ్రామాల నుంచి ధాన్యాన్ని విక్రయించడానికి మార్కెట్‌కు వచ్చే రైతుల ఆకలి తీర్చడానికి సొంత ఖర్చుతో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించినట్లు ఆమె తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.